ఆనారోగ్యంతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి

ఆనారోగ్యంతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి
- నివాళులర్పించిన కేటీఆర్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల పద్మ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాసర్ల పద్మ బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 27వ వార్డులో విజయం సాధించారు. కాసర్ల పద్మ గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లకు చేరుకుని పద్మ భౌతికకాయానికి నివాళులను అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ మరణ వార్త తెలిసిన వెంటనే పార్టీ శ్రేణులు, కాలనీవాసులు మృతురాలి ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. కౌన్సిలర్ గా ఎన్నికైన కొద్ది నెలలకే అనారోగ్యంతో ఆమె మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని కేటీఆర్ తో పాటు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు.
