శ్రీరామనవమికి ముస్తాబైన కడెం రామాలయం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కడెం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గడప దేవరాజ్ ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఆలయ అర్చకులు నీరజ్ పంతులు ఆధ్వర్యంలో ఈనెల 27న శుక్రవారం 11:30 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని కళ్యాణం అనంతరం కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు ఏప్రిల్ 2వ తేదీన స్వామి వారి రథోత్సవం మూడవ తేదీన తెప్పోత్సవం రాత్రి ఏకాంత సేవ కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు.

కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులందరూ వచ్చి స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

Leave a Reply