Legislature | కంపెనీలు తగ్గిపోతున్నాయన్న ఆవేదన

Legislature | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు టవర్లు నిర్మించామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

శాసనసభలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి పలువురు కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సిద్దిపేట ఐటీ టవర్‌ను ఉదాహరణగా చూపిస్తూ, గతంలో అక్కడ 18 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించగా, ప్రస్తుతం 11 కంపెనీలకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. ఇంటర్నెట్ బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్ కూడా నిలిపివేశారని పేర్కొన్నారు.

అలాగే, అక్కడ పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని అన్నారు. గతంలో మూడు సంవత్సరాల పాటు ఉచిత అద్దె సదుపాయం కల్పించామని గుర్తుచేస్తూ, ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలకు మరో మూడు సంవత్సరాల పాటు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply