Prithvi Shaw |ఈసారి గట్టిగా కొడ్తా..
Prithvi Shaw |ఈసారి గట్టిగా కొడ్తా..
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా
100 శాతం కాదు 200 శాతం కష్టపడుతా
టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే టార్గెట్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క : భారత యువ ఆటగాడు పృథ్వీ షా ఆరంభ శూరత్వం చూసి మరో టెండుల్కర్ అవుతాడని అందరూ కొనియాడారు. భవిష్యత్‌లో టీమిండియా భవిష్యత్తు సారథి అవుతాడని ప్రశంసలు కూడా అందుకున్నాడు ఈ ముంబై కుర్రాడు. కానీ చెడు స్నేహాలు, వివాదాలు, గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. భారత్‌కు అండర్ 19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా రికార్డు ఉన్న ఇతనికి ప్రస్తుతం అటు భారత జట్టులోనూ, ఇటు ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ప్లేస్ దొరకడం కష్టంగా మారింది. కానీ ఈసారి ఎలాగైన గట్టిగా కొడతా… మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానని పృథ్వీ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే.. అతనితో కలిసి ఎవరు ఆడినా బాగా ఆడాలి. నేనే ఓపెనింగ్ చేయాలని కోరుకోవడం లేదు. ఎవరు ఓపెనింగ్ చేసినా.. జట్టుకు విజయాన్ని అందించాలని స్పష్టం చేశాడు.

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తానని, 200 శాతం కష్టపడుతానని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన పృథ్వీ షాను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కనుకరించి రూ.75 లక్షల కనీస ధరతో కొనుగోలు చేసింది. అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది గ్యారెంటీ లేదు.

గత కొన్నేళ్లుగా నేను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. వాటన్నింటినీ నేను చిరనవ్వుతో స్వీకరించాను. నేను తిరిగి జట్టులోకి వచ్చినా.. అవన్నీ నా మనసులోనే ఉంటాయి. టీమిండియాలోకి రావాలంటే ఒకటే మార్గం. కష్టపడాలి.. సాయశక్తుల కృషి చేయాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ‘టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం నేను చాలా కష్టపడుతున్నాను. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడుతున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. కానీ భారత జట్టులోకి తిరిగి రావడానికి, ట్రోఫీని గెలవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. జట్టు విజయం కోసం 100 శాతం కాదు.. 200 శాతం కృషి చేస్తాను.
