ఘనంగా ఈదమ్మ తల్లి దేవత కళ్యాణం..

ఘనంగా ఈదమ్మ తల్లి దేవత కళ్యాణం..
చిట్యాల, ఆంధ్రప్రభ : ఉరుమడ్ల పల్లపు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వడ్డెరల కులదేవత ఈదమ్మ తల్లి దేవత పండుగ జరుపుకున్నారు. మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అష్టోత్తరాలు ప్రత్యేక అలంకరణ అమ్మవారికి చీర, సారే సమర్పించడం జరిగింది. ఈదమ్మ అమ్మవారికి ప్రత్యేక ప్రసాదాలు నైవేద్యాలు పల్లపు వారు కుటుంబ సభ్యులు సమర్పించారు.
ఈదమ్మ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు ఆహ్వానం మేరకు ఈదమ్మ పండుగ కార్యక్రమంలో ఉరుమడ్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో ఈదమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దీవెనలు ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నారు. ఈదమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. పండుగ సందర్భంగా పల్లపు వారు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈదమ్మ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, కాంగ్రెస్ పార్టీ ఉరుమడ్ల గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, ఉరుమడ్ల గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ జన్నపాల శ్రీను, పాకాల దినేష్, మేడ బోయిన స్వాతి శ్రీను, గుత్తా రవీందర్ రెడ్డి,జన్నపాల రాము, పల్లపు రామకృష్ణ,పల్లపు శివ, పల్లపు లక్ష్మీనరసింహ, పల్లపు నోవెందర్, పల్లపు శివ శంకర్ వరప్రసాద్, పల్లపు వెంకటేశం, పల్లపు చిన్న వెంకటేష్,పల్లపు రాకేష్,, పల్లపు సాయి,పల్లపు ప్రణవ్, పల్లపు విజయ్, శివరాత్రి కొండల్, శివరాత్రి యాదయ్య, శివరాత్రి వెంకన్న, శివరాత్రి మోహన్, శివరాత్రి నగేష్, శివరాత్రి శ్రీను, బోదాసు వెంకటేష్ ఇరుగదిండ్ల వెంకటేష్, వరికుప్పల వెంకులు, పల్లపు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈదమ్మ పండుగ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు గ్రామ పెద్దలను పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
