పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలో కళాకారులు…

పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలో కళాకారులు…

ఆకట్టుకున్న పౌరాణిక పద్య నాటకం

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, సృజనాత్మకత సమితి సౌజన్యంతో స్థానిక గాంధీనగర్ వి.హెచ్. గ్రంథాలయంలో శ్రీకాళహస్తీశ్వర మహత్యం పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించబడింది. శ్రీ సాయి హృదయ కళానాట్యమండలి, 34 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ నాటక ప్రదర్శనలో మెట్ల దామోదరరావు, రంప జగదీశ్వరరావు శర్మ, కరణం శంకరరావు, జి సూర్యనారాయణ, జి జగన్నాథం, రవికుమార్, జి తవుడు, పి రుద్రయ్య, ఎం.వి.రమణమూర్తి, జి లలితా రాణి, ఎన్ సరస్వతి, ఎం వి మూర్తి ఆయా పాత్రల్లో రాణించి నాటకాన్ని రక్తి కట్టించారు.

రచన మీగడ రామలింగస్వామి, సంగీతం, దర్శకత్వం మీగడ మల్లికార్జునస్వామి, లైటింగ్ వి లక్ష్మీనారాయణ, డోలక్ కే కూర్మారావు,నాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ కళాకారుడు అగురు త్రినాథ నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా గుంట్రెడ్డి బలరామస్వామిని రంగస్థల నటాచార్య కొప్పరపు శ్రీనివాసరావును రంగస్థల నటా విశిష్ట బిరుదుతో సత్కరించారు. కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధువు కోగంటి సత్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు.

గుమ్మడి జయరాజ్ కళాపీఠం అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో గుమ్మడి జీవన్ కుమార్, మోడీ ఆంజనేయులు, బొత్స సూర్యనారాయణ, నిమ్మగడ్డ ఏసుపాదం, కె.వి. రమణ, మోట్రు ఆంటోనీ, వి ఎస్ మాధవ, దమ్ము సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.