చికిత్స పొందుతూ ఉపాధి హామీ పథకం కూలి మృతి

ఘంటసాల, ఆంధ్రప్రభ ; ఘంటసాల మండలం తెలుగురావుపాలెంలో ఉపాధి హామీ పథకం పనిలో భాగంగా పంట బోదు తవ్వుతున్నటువంటి ఉపాధి హామీ కూలి అగ్నిహోత్రం రాజేష్ ఎండ దెబ్బకు గురై వెనక్కి పడిపోవడం జరిగింది. తోటి కూలీలు దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యుడు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్ళమని చెప్పాడు. దీంతో బాధితుడి బంధువులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
ఉపాధి హామీ పథకం ఏపీఓకు సమాచారం చెప్పినప్పటికీ స్పందించలేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఎండిఓకు సమాచారం తెలియజేస్తానని చెప్పిన ఏపీవో ఎంతవరకు స్పందించకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందోలు జైపాలుడు మాట్లాడుతూ… తెలుగురావుపాలెం గ్రామానికి అగ్నిహోత్రం రాజేష్ కు తనకు బావమరిది అన్నారు.
ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ వెనక్కి పడిపోవడంతో తలకు గాయం కావడంతో రాజేష్ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. తెల్లవారుజామున 6 ఉదయం గంటలకు అగ్నిహోత్రం రాజేష్ విజయవాడ ఏలూరు రోడ్డులోని ప్రభుత్వాసుపత్రిలో మరణించాడని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బాధితుడు కుటుంబానికి పరిహారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
