fans fire| పాండ్యా… నీ రొమాన్స్ త‌గెలెయ్యా..

fans fire| పాండ్యా… నీ రొమాన్స్ త‌గెలెయ్యా..

ఎక్క‌డ ప‌డితే అక్క‌డేనా..?
కార్‌ కడుగుతూ ముద్దులేంట్రా బాబూ..
మండిప‌డుతున్న క్రికెట్ అభిమానులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న ప్రియురాలితో రొమాన్స్ చేయ‌డంలో హ‌ద్దులు మీరుతున్నాడ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌న గ‌ర్ల‌ఫ్రెండ్‌కు ముద్దులు పెడుతూ ఓవ‌ర్ చేస్తున్నాడ‌ని అభిమానులు ట్రోల్ చేస్తున్నాడు. ఇటీవ‌ల ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం కూడా హార్దిక్ పాండ్యా ఇలానే హద్దులు ధాటి ప్రవర్తించాడు. పబ్లిక్ ప్లేస్‌లో జనాల మధ్య.. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే సోయి లేకుండా మహికా శర్మను పదే పదే ముద్దాడాడు. ట్రోఫీ అందించిన పోడియంపై ఇద్దరు పడుకొని రొమాన్స్ చేయడంపై అభిమానులు మండిప‌డ్డారు. తన ప్రియురాలితో కలిసి స్టేజ్‌పై పడుకుని ఉండగా, అతని భుజంపై జెండా అలానే ఉందని, ఇది జాతీయ పతాకాన్ని కించపరిచినట్టేనని ఆరోపించారు. మహికా శర్మతో కలిసి డాన్స్ చేసేటప్పుడు గానీ, స్టేజీపై పడుకున్నప్పుడు గానీ హార్దిక్ పాండ్యా వీపునకు జాతీయ జెండా కట్టి ఉందని ఆయన గుర్తు చేశారు.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. తన ప్రియురాలు మహికా శర్మతో రోమాన్స్ మితిమీరి పోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన కారును వాష్ చేస్తూ.. మహికా శర్మను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నువ్వు.. నీ ఏషాలు..కార్‌ కడుగుతూ ముద్దులేంట్రా!’అని విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు మహికా శర్మ మరుగుమందు పెట్టిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే ఈ కార్ వాష్ వీడియో ఘటన నవంబర్‌లో జరగ్గా.. ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను మళ్లీ తెరపైకి తెచ్చారు.దాంతో హార్దిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Leave a Reply