దేశభక్తిని పెంచే వందేమాతరం..
కడెం, (ఆంధ్రప్రభ)
“వందేమాతరం” జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కడెం మండల తాహసిల్దార్ కార్యాలయంలో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. కడెం మండల తహసిల్దార్ రొడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు.
కడం తహసిల్దార్ ఆర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. సామూహిక గీతాలాపనలో కడెం డీటీఏం లచ్చిరామ్, ఆర్ ఐ శారద, సీనియర్ అసిస్టెంట్ ఎస్ గంగన్నతో పాటు కార్యాలయం ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

