నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి..

పామర్రు, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. పామర్రు మండలం అడ్డాడ గ్రామం జడ్పీ హైస్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని పంపిణీ చేశారు.
విద్యార్థులు సెల్ ఫోన్లు వాడకుండా విద్యార్థులు బాగా చదివి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేర్లు తీసుకురావాలని అన్నారు. భవిష్యత్తులో 10వ తరగతి సర్టిఫికెట్ కు ఉన్న ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
