గురుకుల హైస్కూల్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

గురుకుల హైస్కూల్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలం బల్లిపరు గురుకుల హైస్కూల్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.

పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు..

‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత మీద మన అందరిలో బాధ్యత కలగాలి. “భవితరాల భవిష్యత్తు బాగుండాలంటే, మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఈ కార్యక్రమం అనంతరం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభించి, ఇంకుడు గుంతలను కంపోస్ట్ ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను తిల‌కించారు.

Leave a Reply