పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటే..

పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటే..

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని దేవిరెడ్డి బంగ్లా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్వేల్ గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ భూసా వెంకటేశ్వర్లును టాటా ఏసి వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దేవిరెడ్డి బంగ్లాలో వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply