ప్రతి కార్యకర్త చురుగ్గా పని చేయాలి…

ప్రతి కార్యకర్త చురుగ్గా పని చేయాలి…

రాప్తాడు, ఆంధ్రప్రభ : వైయస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కట్టుదిట్టంగా పని చేసి వైసిపి పార్టీని మరింత బలోపేతం చేయాలని మండల కన్వీనర్ మరూరు వెంకటేష్ పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నందు మండల నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని పార్టీ కార్యాలయం నుండి 44వ జాతీయ రహదారి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 సం.లు పూర్తి చేసుకున్న సంధర్బంగా భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు ప్రజలకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు.

మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వైసిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వైసిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామాంజనేయులు, సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, మాజీ కన్వీనర్ శేఖర్, బండిమీదపల్లి సర్పంచ్ పక్కీరప్ప, మరూరు చెన్నారెడ్డి, సింగారప్ప, భోగినేపల్లి ఓబిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply