Raptadu రోడ్–కమ్ చెక్‌డ్యామ్‌కు భూమిపూజ

Raptadu రోడ్–కమ్ చెక్‌డ్యామ్‌కు భూమిపూజ

  • రోడ్–కమ్ చెక్‌డ్యామ్‌కు భూమిపూజ
  • గ్రామాభివృద్ధికి కీలక అడుగు: టీడీపీ మురళి

రాప్తాడు (Raptadu), ఆంధ్రప్రభ: రాప్తాడు మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని రాప్తాడు టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరపు మురళి పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు గ్రామ పంచాయతీలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయం రోడ్డు నుండి పండమేరు వంక మీదుగా శ్రీ పండమేరు వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రోడ్ కమ్ చెక్‌డ్యామ్ నిర్మాణానికి ఆయన గ్రామ పెద్దల సమక్షంలో భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ధర్మవరపు మురళి మాట్లాడుతూ, ఇది రాప్తాడులో మరో చారిత్రాత్మక అడుగు అని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే భక్తులు, రైతులు, గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రెండు దేవాలయాల అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ చెన్నకేశవులు, ఎంపీడీవో విజయలక్ష్మి, మైనర్ ఇరిగేషన్ ఏఈ కృష్ణకుమార్, కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ, యూత్ అధ్యక్షుడు బొమ్మేపర్తి రాజశేఖర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply