ఐఐఐటి నూతన సంచాలకులుగా…

ఐఐఐటి నూతన సంచాలకులుగా…

అమరేంద్ర కుమార్ బాధ్యతల స్వీకారం

ఎచ్చెర్ల(శ్రీకాకుళం), ఆంధ్ర‌ప్ర‌భ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటి) నూతన సంచాలకులుగా ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విశ్వవిద్యాలయ రిజిస్టార్ గా విధులు నిర్వహిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తరగతుల నిర్వహణలో మెరుగుదల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి ముని రామకృష్ణ, డీన్ శివ రామకృష్ణ, ఆర్థిక అధికారి వాసు, రెండో ప్రాంగణ పర్యవేక్షకులు సాగర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు…

Leave a Reply