సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి

పల్నాడు ప్రగతే చంద్రబాబు ధ్యేయం: ఎమ్మెల్యే జూలకంటి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు

మాచర్ల, ఆంధ్రప్రభ : పల్నాడు ప్రగతి చంద్రబాబు ధ్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం సాయంత్రం వరకు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పల్నాడు జిల్లా రివ్యూ మీటింగ్ లో ఎమ్మల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరగాలని సీఎం సూచించారని చెప్పారు.

ప్రజా సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధిని సమతాటిపై నడిపించాలని కోరారన్నారు. సాగు, తాగు, మౌలిక వసతులు అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ప్రణాళికలు సిద్ధం చేసి పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గడిచిన 20 నెలల పాలనపై పూర్తిస్థాయిలో ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఎమ్మెల్యే జూలకంటి చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఇన్చార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply