అమరావతి, ఫిబ్రవరి 28: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెట్టేందుకు ముందు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్‌లు హాజరయ్యారు.

టిటిడి ఆలయంలో..
అనంతరం బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.