అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఆపన్న హస్తం..

అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఆపన్న హస్తం..

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3.25 లక్షల సహాయం..
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చొరవతో మంజూరు..

తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 5వ వార్డుకు చెందిన గోనెల హేమంత్ ప్యాంక్రియాస్ (క్లోమగ్రంథి) వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3.25 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రావు చొరవతో ఈ సహాయం మంజూరు కావడం కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది.

హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స ఖర్చులు భరించలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3,25,000 (ఎల్‌ఓసీ) మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సహాయం తమ కుమారుడి చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని హేమంత్ తండ్రి రామకృష్ణ తెలిపారు. కష్టకాలంలో స్పందించి సహాయం అందించిన ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు కు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply