CM | ముస్లిం మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం..

CM | ముస్లిం మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం..

ప్రభుత్వ ఇఫ్తార్ విందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్..
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎంపీ శివనాధ్..

CM | భవానిపురం, ఆంధ్రప్రభ : ముస్లిం మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని )అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముసాఫిర్ ఖానా సెక్రెటరీ షేక్ అమానుల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్ లో ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాధ్ కు ముస్లిం మైనారిటీలు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. పేద ముస్లిం మైనార్టీల కుటుంబాల వారికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ… ముస్లిం మైనారిటీలకు పవిత్ర మాసం రంజాన్ మాసం అని అన్నారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష చేపట్టి అల్లాహ్ కృప కోసం ప్రార్థన చేస్తారన్నారు. పేద ముస్లిం కుటుంబాల వారు సైతం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్నారు.

CM |

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలవారు కలిసిమెలిసి ఉండే నగరం విజయవాడ నగరం అని, ఇటువంటి సాంస్కృతి దేశంలో ఎక్కడా లేదన్నారు. పెద్ద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తుఫాను అందించేందుకు ముందుకు వచ్చిన నాయకులు అమానుల్లా ఖాన్ ను ఎంపీ అభినందించారు. ఈనెల 16వ తేదీన సోమవారం సాయంత్రం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ… సర్వమత సమ్మేళనం విజయవాడ నగరం అన్నారు.

CM |

ఏ మతమైనా ఏ కులమైనా విజయవాడ నగరంలో అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకుంటారన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయన్నారు. తిరువూరు వంటి చోట మూడు వేల మందికి ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లిం పక్షపాతి అని కేశినేని చిన్ని నిరూపించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో ముస్లింల అభ్యున్నతి కాంక్షించే నాయకుడు ఎంపీ చిన్ని అని చెప్పారు.

CM |

కార్యక్రమం నిర్వాహకుడు అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరములుగా రంజాన్ మాసంలో పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే కరీముల్లా, రాష్ట్ర నాయకులు పైజాన్, ఫిరోజ్, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, మైనార్టీ సెల్ 55వ డివిజన్ అధ్యక్షుడు జాహీద్, 54వ డివిజన్ అధ్యక్షుడు హాజీబ్, మార్కెట్ యార్డ్ కమిటీ ఉపాధ్యక్షుడు పాల మాధవ, మహిళా విభాగం నాయకులు పి.పద్మ, నంద కుమారి, స్థానిక నాయకులు రమణ, సంతోష్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

CM |