మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
మక్తల్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బిజెపి నుండి కౌన్సిలర్గా గెలుపొందిన వారిని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య తోకలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పట్టణ బిజెపి అధ్యక్షులు బి. రాజశేఖర్ రెడ్డి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గా బీజేపీ నుండి ఎంపికైన బి. రాజశేఖర్ రెడ్డి, పీకే. నరసింహ, టప్ప కృష్ణాలను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కోసం బిజెపి నుండి గెలుపొందిన కౌన్సిలర్లుగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని అన్నారు. 16 వార్డుల సమస్యలపై పాలకవర్గాన్ని ముప్పు తిప్పలు పడుతూ సమస్యల పరిష్కారంలో ముందు నిలవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
