గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి…

గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి…
ఊర్కొండ, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ విధిగా భాగస్వామ్యం అవ్వాలని సర్పంచ్ అబ్దుల్ రషీద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఊరుకొండ పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పరిసర ప్రాంతాలలో, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, మహిళా సంఘాల నాయకురాలు, గ్రామ మహిళలతో, వార్డు సభ్యులు, తనూ సైతం చీపురు పట్టి పరిసర ప్రాంతాలను ప్రభుత్వ కార్యాలయాల ముందు, విధులను శుభ్రపరచారు.
అనంతరం మురుగు నీరు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అనంతరం వారు మాట్లాడుతూ … ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు మురుగు నీరు నిలవకుండా చూసుకొని దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విష జ్వరాల బారిన పడకుండా ఉంటామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
