రైతు భరోసాకు రైతులు దరఖాస్తు చేసుకోండి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు ఈనెల 15 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులని రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రైతు భరోసా పథకానికి రైతులు దరఖాస్తు ఫారం తో పాటు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాఫీలతో వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన తమ గ్రామాల్లో పరిధిలోని ఏఈఓ లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని 23 మంది సర్పంచ్ లు , వార్డు సభ్యులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకు నేందుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
