వైభవంగాశ్రీవాసవిమాత జయంతి వేడుకలు..

వైభవంగాశ్రీవాసవిమాత జయంతి వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకుని ఆదివారం ఆర్యవైశ్య ఆరాధ్య దైవమైన వాసవి మాత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పురోహితులు హరి సర్వోత్తమచారి ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అభిషేకం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం నాయకులు, మహిళలు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply