సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం…

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం…
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రిజర్వాయర్‌కు సంబంధించిన ప్రధాన కాలువ కట్టలపై పెద్ద ఎత్తున చెట్లు పెరిగి ఉన్నాయని, వాటిని తొలగించడంలో ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని నాగం ఆరోపించారు.
కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కాలువలపై పెరిగిన చెట్లు అలాగే ఉంటే కాలువ కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు సాగునీరు అందక జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.

చెరువుల సామర్థ్యాన్ని పెంచి రైతులకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రైతులకు సాగునీరు అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు నాగం శశిధర్ రెడ్డి, అర్ధం రవి, అర్జునయ్య, లక్సమయ్య, సత్యం తదితరులు ఉన్నారు.
