ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన …

ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన …
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం లోని చౌటుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిభిరాన్నీ నిర్వహించారు.ఈ శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని 243 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి,27 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. 34 మందిని జిజిహెచ్ నిజామాబాద్ కు రెఫర్ చేశారు. అవసరమైన వారికి మందులను అందజేశారు.
ఈ శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తి ప్రియ,పిల్లల వైద్యులు డాక్టర్ శరత్, కంటి వైద్యులు డాక్టర్ సంకీర్తన, ఆర్థోపెడిక్ డాక్టర్ శుభం, డెంటల్ డాక్టర్ ప్రవీణ్, జనరల్ వైద్యులు డాక్టర్ మోసిన్ పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహబూబ్, డిపిఎం, ఏపీఎం కిరణ్ కుమార్, సాయి, వైధ్యాధికారిని డాక్టర్ స్పందన ల, హెచ్ఈఓ సత్యనారాయణ, సూపర్వైజర్స్ స్వరూప, పద్మ, పవన్, రాంబాబు, మధు వినీత్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


