కొండగట్టుకు అంజన్న స్వాముల పాదయాత్ర..

కుంటాల, ఆంధ్రప్రభ ; మండలంలోని లింబ కె గ్రామానికి చెందిన దాదాపు 25 మంది హనుమాన్ స్వాములు స్థానిక లింబ కే హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే ముడుపులు చెల్లించే మొక్కులు తీర్చుకుంటామని తెలియజేశారు. దీంతో అధిక సంఖ్యలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులకు స్వాగతం పలికి పాదయాత్రను ప్రారంభించారు.
