ఏనుగుల సమస్యను పరిష్కరించాం

ఏనుగుల సమస్యను పరిష్కరించాం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ‘హనుమాన్‌’ ప్రాజెక్టును చేపట్టింది. మంగళగిరిలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జ‌న‌సేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించామని పవన్‌కల్యాణ్‌ అన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు.

Leave a Reply