బైక్ ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి దుర్మరణం

బైక్ ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి దుర్మరణం
వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పరిధిలోని డీసీఎం బైక్ ఢీకొనడంతో గణేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గానుగట్టు తండా పరిధిలోని ఒంటిగుడిశే తాండకి చెందిన గణేష్ (30) అనేవ్యక్తి కల్వకుర్తి లోని ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ డ్రైవర్ గా పని చేస్తూ వ్యవసాయ పనుల నిమిత్తం కొరకై స్వగ్రామం వంటి గుడిసె తండాకి వెళ్తున్న సమయంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఎన్నమ్స్ హాస్పిటల్ సమీపంలో డీసీఎం ఢీకొనడంతో గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడని స్థానికుల తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గణేష్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
