నవాబుపేటలో మాదిగ అమరవీరులకు నివాళులు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేటలో మాదిగ అమరవీరులకుఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ, నివాళులర్పించారు. అనంతరంఆయనమాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమ ఘట్టాలలో వీరోచితమైన పాత్రను పోషించి జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు. కన్నీటి నివాళులు. అర్పించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట సర్పంచ్ పర్లపెల్లి రవి, ఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లెల్ల పోశాలు, మారపల్లి మొండయ్య, ములుగురి స్వప్న, సమ్మయ్య, శంకర్, రాజ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
