ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: సర్పంచ్ రమాదేవి

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: సర్పంచ్ రమాదేవి

మునుగోడు (ఆంధ్రప్రభ): ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా మునుగోడు మండల కేంద్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply