గూడెం గోదావరి బ్రిడ్జ్‌పై రోడ్డు ప్రమాదం..

గూడెం గోదావరి బ్రిడ్జ్‌పై రోడ్డు ప్రమాదం..
- డిగ్రీ విద్యార్థి మృతి
దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి బ్రిడ్జ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడెం గ్రామానికి చెందిన ఆకుల అక్షయ్ కుమార్ (23) అనే డిగ్రీ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.
దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ తన బంధువును రాత్రి జగిత్యాల జిల్లా రాయపట్నంలో దింపి, హెచ్ఎఫ్ డీలక్స్ (టీఎస్19 డి5921) బైక్‌పై తిరిగి గూడెం వస్తుండగా, గూడెం నుండి రాయపట్నం వైపు వెళ్తున్న ఏపీ15 టీసీ2959 నంబర్ గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన గోదావరిఖనికి చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ సలీమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసినోద్దీన్ వెల్లడించారు.
