వామన్ రావు హత్య కేసు విచారణ

పెద్దపల్లి ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసు (Vaman Rao couple murder case) విచారణలో సిబిఐ వేగం పెంచింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కోర్టు (Peddapalli District Court)కు సిబిఐ అధికారులు (CBI officials) వచ్చారు. హత్య కేసుకు సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సిబిఐ కి అప్పగించిన విషయం విధితమే.

గురువారం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సిబిఐ అధికారుల బృందం వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో, మంథని కోర్టులో, హత్య జరిగిన ప్రదేశం కల్వచర్లలో విచారణ చేపట్టగా రెండో రోజు పెద్దపల్లి కోర్టులో హత్యకేసుకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. సిబిఐ అధికారుల వెంట గోదావరిఖని ఏసిపి మడత రమేష్ (Godavarikhani ACP Madatha Ramesh) తో పాటు పలువురున్నారు.

Leave a Reply