అలరించిన విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు..

అలరించిన విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు..

విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను అలవర్చుకోవాలి
హసన్ పర్తి సీఐ చేరాలు.

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను అలవర్చుకొని క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హసన్ పర్తి సీఐ వట్టే చేరాలు కోరారు.హసన్ పర్తి మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సంబరాలను నిర్వహించారు. ఈసందర్బంగా చేరాలు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు మరికొద్ది రోజుల్లో బోర్డ్ ఎగ్జామ్స్ కి హాజరవ్వడం, వారి జీవితంలో మొదటి మెట్టు దాటినట్లు అవుతుందని తెలిపారు.ప్రతి విద్యార్థి తాను అనుకున్న గమ్యాన్ని చేరుటకు,క్రమం తప్పకుండా ప్రయత్నించాలని సూచించారు.

సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల 32 సంవత్సరాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చడం గొప్ప విషయం గా కొనియాడారు. విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా భద్రత నియమాలను పాటించే, సైబర్ నేరాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా తమ తమ తల్లిదండ్రులకు, బంధువులకు, సమీప ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని వివరించారు.ఈమేరకు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ముందుగా అకాడమిక్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు చేరాలు మెడల్స్ అందజేశాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తిరుమలేశ్వర్ రెడ్డి, డైరెక్టర్స్ వెంకటేశ్వర్లు, సదానందం, కల్పనా రెడ్డి లతోపాటు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply