సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామంలో గ్రామస్తుల దశాబ్దాల నాటి కల నెరవేరింది. గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నుంచి కాదాసీ ఓదెలు ఇంటి వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ ఈసంపల్లి హారిక టెంకాయ కొట్టి ప్రారంభించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో, కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా ఈ మార్గంలో సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు, ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కోటగిరి సతీష్ గౌడ్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేరెళ్ల తిరుపతి గౌడ్, వార్డు సభ్యులు రావుల కిషోర్, బొల్లి పైడి, దేశిని సాయి కిరణ్, శ్రీపతి రవి, నల్లగొని మణికంఠ గౌడ్, నేరెళ్ల వెంకటేష్, నేరెళ్ల రమాకాంత్, ఇసంపల్లి హరితేజ, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
