Deputy CM | పవన్ కళ్యాణ్ కార్యాలయంలో వ్యక్తి చొరబాటు

Deputy CM | పవన్ కళ్యాణ్ కార్యాలయంలో వ్యక్తి చొరబాటు
- ఘటనపై ఉన్నతాధికారుల సీరియస్
- రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పెంటారావుతో పాటు
- ఐదుగురు సిబ్బంది మాతృశాఖకు బదిలీ
Deputy CM | అమరావతి, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి అనుమతి లేకుండా చొరబడిన ఘటన సంచలనం రేపింది. భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్న అంశంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనపై హుటాహుటిన ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు, భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించారని సమాచారం. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటూ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఐదుగురు సిబ్బందిని మాతృశాఖకు బదిలీ చేశారు.
రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పెంటారావుతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు తమ మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విస్తృత విచారణ కొనసాగుతోందని, భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవగా, భద్రతా వ్యవస్థపై రివ్యూపున:సమీక్ష అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు అధికారిక నివేదిక అనంతరం వెలువడే అవకాశముంది.
