విద్యార్థులు సైన్స్ రంగంలో రాణించాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు సైన్స్ రంగంలో రాణించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఊట్కూర్ మండల విద్యాశాఖ అధికారిని మాధవి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని భారత దేశ ఆచార సంప్రదాయాలలో సైన్సు దాగి ఉందని అన్నారు.

ప్రతి విద్యార్థి సైన్స్ లో పట్టు సాధించాలన్నారు. పాఠశాలలో విద్యార్థులు సైన్స్ పై చేసిన వివిధ ప్రయోగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేపట్టిన వివిధ రకాల అలంకరణలు చూడముచ్చటగా ఉండడంతో విద్యార్థులను అభినందించి బహుమతులు పంపిణీ చేశారు. ఊట్కూర్ పట్టణంలోని రిషి బ్రైడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా పాఠశాలలో సైన్స్ దినోత్సవం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అబ్దుల్ సలాం ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply