కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు అభివృద్ధి…

వెల్దండ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మహిళలు అభివృద్ధి చెందుతున్నారని పోచమ్మ గడ్డ తాండ సర్పంచ్ మణిపాల్ నాయక్ అన్నారు. వెల్దండ మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ఇందిర మహిళ శక్తి భవన్ కు శుక్రవారం భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ మణిపాల్ నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రకళ గోపాల్ ,పి ఆర్ ఏ ఈ సురేందర్ రెడ్డి, ఈసీ దేవేందర్,పంచాయతీ కార్యదర్శి నవనీత,వార్డు సభ్యులు ఆర్ శ్రీరామ్, నిర్మల పాండు, మాజీ వార్డు సభ్యులు గోవర్ధన్ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
