గ్రామ సమస్యలే ప్రథమ పరిష్కారం

గ్రామ సమస్యలే ప్రథమ పరిష్కారం

  • చెర్కూర్ సర్పంచ్ శ్రీనివాసులు

వెల్దండ, ఆంధ్రప్రభ ; గ్రామ సమస్యలే ప్రథమ పరిష్కారం అంటూ చెరుకూర్ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు అన్నారు. వెల్దండ మండల సమీపంలోని చెరుకూర్ గ్రామపంచాయతీలోని సమస్యలపై సర్పంచ్ శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా చెరుకూర్ గ్రామపంచాయతీ లోని 4వ వార్డ్ సమీపంలోగల మెయిన్ రోడ్డుపై ఉన్న త్రాగునీటి బోరు సమస్యతో వాహనాల రాకపోకలకు గత కొన్ని సంవత్సరాలుగా అంతరాయాన్ని కలిగిస్తున్న పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో గురువారం సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి రాకపోకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రమేష్,లాలయ్య, కాలనీ వాసులు, రామకృష్ణ, మల్లయ్యా, సందీప్, లింగేష్, మహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply