మార్కెట్ చైర్మన్ చర్చకు రావాలని టీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: అవినీతికి పాల్పడ్డ మార్కెట్ చైర్మన్ రమణారావు చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయింపు ఆందోళన చేపట్టాయి.

రైతు సమస్యలు, పన్నుల రద్దు అంశాలపై చర్చకు రావాలని, అలాగే “రైతు రాజ్యం కావాలి, రాక్షస రాజ్యం పోవాలి” అంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పందించి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.

ఆదివారం మధ్యాహ్నం మార్కెట్ చైర్మన్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ చేసిన నేపథ్యంలో సోమవారం చర్చకు రావాలని టీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. అయితే మార్కెట్ చైర్మన్ రమణారావు చర్చకు హాజరు కాలేదు.

దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయింపు చేపట్టగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా కొనసాగుతోంది.