Peddi | తెర వెనుక ఏం జరుగుతోంది..?

Peddi | తెర వెనుక ఏం జరుగుతోంది..?
Peddi | పెద్ది రిలీజ్ మళ్లీ వాయిదా పడనుందా?
ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది?
ఏప్రిల్ 30న రిలీజ్ సాధ్యమేనా?
బుచ్చిబాబు టెన్షన్లో ఎందుకు?
స్పెషల్ సాంగ్ ఇంకా ఫైనల్ కాలేదా?
మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన
లెనిన్ రిలీజ్‌పై ప్రభావం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎప్పుడో పూర్తవ్వాలి కానీ.. ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. మార్చి 27న రావాల్సిన పెద్ది.. ఏప్రిల్ 30న వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని.. ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అసలు పెద్ది షూటింగ్ కు సంబంధించి ఎంత వర్క్ బ్యాలెన్స్ ఉంది..? ఈసారైనా అనౌన్స్ చేసిన డేట్ కి వస్తుందా..? వాయిదా పడనుందా..?
Peddi | మార్చి ఫస్ట్ వీక్ లో..

మెగా ఫ్యాన్స్ పెద్ది సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఛార్ట్ బస్టర్ అవ్వడంతో.. మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. సెకండ్ సింగిల్ కూడా అదిరిపోతుందనే నమ్మకాన్ని కలిగించింది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా పెద్దికి భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇంకా థియేట్రికల్ రైట్స్ అమ్మకపోయినా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిజినెస్ కోసం బడా డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్ లో పెద్ది సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Peddi | టెన్షన్ లో బుచ్చిబాబు..

లేటెస్ట్ గా పెద్ది వాయిదా పడనుందా అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఎంత వర్క్ బ్యాలెన్స్ ఉందంటే.. టాకీ ఇంకా కంప్లీట్ కాలేదు. టాకీతో పాటు ప్యాచ్ వర్క్ ఉంటుంది. స్పెషల్ సాంగ్ షూట్ చేయాలి. పోస్ట్ ప్రొడక్షన్, పాన్ ఇండియా ప్రమోషన్స్.. ఇవన్నీ రెండు నెలల టైమ్ లోనే అవ్వాలి. ఎంత లేదన్నా ఫస్ట్ కాపీ రెడీ అవ్వడానికి నెలన్నర అయినా పడుతుంది అంటున్నారు. అది కూడా.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేస్తే. ఏప్రిల్ 30నే రిలీజ్ చేయాలి అనుకుంటే.. పస్ట్ కాపీ రెడీ అయినా ప్రమోషన్స్ కి టైమ్ కుదరకపోవచ్చు. దీంతో బుచ్చిబాబు చాలా టెన్షన్ లో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
Peddi | అందుకే.. పెద్ది వాయిదా..?

అలాగే స్పెషల్ సాంగ్ ఎవరితో చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఎంత లేదన్నా ఇంకా ఓ పాతిక శాతం షూట్ బ్యాలెన్స్ ఉందనేది ఇన్ సైడ్ టాక్. మార్చి 27న రావాల్సి పెద్ది పోస్ట్ పోన్ అనగానే మెగా ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఆ టైమ్ కి పవర్ స్టార్ ఉస్తాద్ వస్తుందని ఫరవాలేదు అనుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 30న కూడా రాకపోతే సోషల్ మీడియాలో పరిస్థితి ఎలా ఉంటుందో అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మళ్లీ వాయిదాపడనుందనే ఉద్దేశ్యంతోనే అక్కినేని అఖిల్ లెనిన్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా వెయిట్ చేస్తుంది. పెద్ది రాకపోతే లెనిన్ మే 1న రావడం ఖాయం. అయితే.. పెద్ది ఏప్రిల్ 30న వస్తాడో.? రాడో మార్చి నెలాఖరుకు క్లారిటీ రావచ్చని టాక్. మరి.. ఏం జరగనుందో చూడాలి.
