విద్యుత్ సమస్యపై స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్

విద్యుత్ సమస్యపై స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్

  • క్షేత్రస్థాయిలో ట్రాన్స్కో ఏఈని రప్పించి పరిష్కారం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ పరిధిలో ని 1 వ వార్డ్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద,అంగడి బజార్ రోడ్డు లో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో తక్షణమే స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న ట్రాన్స్కో ఏ ఈ ప్రభాకర్ రెడ్డి ని క్షేత్రస్థాయిలో రప్పించి విద్యుత్ స్తంభాల మార్పిడికి సూచించారు. దీంతో 2 రోజుల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని ఏ ఈ తెలిపారు. తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించిన వైస్ ఛైర్మన్ వెంకన్న ని కాలని ప్రజలు అభినందించారు.

Leave a Reply