బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖమ్మం యాదయ్య (55) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నామని జగన్నాథం, తేరటుపల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు యాదగిరి రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నామని జగన్నాథం రూ.10 వేలును, వీరమల్ల శ్రీశైలం రూ.10 వేలును ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, వార్డు సభ్యులు చెరిపెల్లి వెంకటేశం, పెదగాని నరేందర్, యిడం గణేష్, పున్న శివ, లడే యాదయ్య, భీమగాని మల్లేష్, పగిళ్ల యాదయ్య, ఖమ్మం రాములు, నరసింహ, రామస్వామి, ఖమ్మం పాండు, ఖమ్మం శేఖర్, ఖమ్మం శ్రీనివాస్, దుబ్బాక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply