ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో…

ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో…

తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : కంటి చూపు పేరుతో కార్పొరేటు స్థాయి వైద్యం అందిస్తామని చెబుతూ ఎంతోమందికి చూపే లేకుండా చేస్తున్న ఓ ప్రైవేటు ఐ హాస్పిటల్ నిర్వాహకంపై సిపిఎం పార్టీ నేతలతో పాటు బాధిత కుటుంబీకులు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రభ దినపత్రికలో కార్పొరేట్ దందా అన్న వార్త కథనం ప్రచురితం అయింది. పెళ్లి చూపుల కోసం కంటికి చికిత్స చేయించుకునేందుకు తిరుపతిలోని హాస్పిటల్ కు వెళ్లిన ఐటీ ఉద్యోగి గిరీష్ కు ఎడమ కన్ను పో కొట్టారు.

దీంతో యువకుడి ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, కుటుంబ భద్రత అన్ని ఒక్కసారిగా కూలిపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు హాస్పిటల్ నిర్వాహకంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో బాధితుల్లో గొప్ప చైతన్యం వచ్చింది. వారికి సిపిఎం పార్టీ వారు మద్దతు పలకడంతో సోమవారం తిరుపతిలోని ఐ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్పిటల్ దోపిడి వ్యవహారంపై తిరుపతి ప్రజలు పెదవి విరుస్తున్నారు.

Leave a Reply