తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
తిరుమల, జూలై 16 (ఆంధ్రప్రభ): నారా భువనేశ్వరి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న ఆమెకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం నారా భువనేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మ్రొక్కులు చెల్లించారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను నారా భువనేశ్వరికి అందజేశారు.
