cbn affection : వావ్.. ప్యూచర్ మీదే Andhra Prabha News

cbn affection : వావ్.. ప్యూచర్ మీదే Andhra Prabha News
నవ.జాత శిశువులతో ఏపీ సీఎం చంద్రహాసం
( ఆంధ్రప్రభ, వినుకొండ )

cbn affection : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ‘ పిల్లల్ని కనండి. ఒకరు ఇద్దరు కాదు.. ఇంకా కనండి. ఎంత మందిని కంటే అంత పెద్ద రాష్టంగా ఏపీ ఎదుగుతుంది’ , అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీలో నవ దంపతులను కోరుతున్నారు. నిజమే.. ఒకప్పుడు ఒకరు లేదా ఇద్దరు నినాదముంటే.. గత మూడు దశాబ్ధాలుగా ఇంటికి ఒకరు చాలు అనే స్థితి ఏర్పడింది.

తాజాగా చైనా సైతం తన జనాభా తగ్గుదలను తట్టుకోలేక పోతోంది. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఆందోళన చెందుతుంది. భవిష్యత్తు పై విజన్ ఉన్న సీఎం.. తాజాగా పిల్లల్ని కనమంటున్నారు. నాయకుల్ని కనమంటున్నారు. ఈ రోజు వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల వార్డులో పర్యటించిన సీఎం ముఖంలో ఇదే భావం కనిపించింది.
cbn affection.. అసలేం జరిగిందటే

స్వచ్ఛాంఅధ్ర-స్వర్ణాంధ్ర పర్యటనలో పల్నాడు జిల్లా, వినుకొండలో పర్యటించారు. వినుకొండ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి రోగులతో కాసేపు మాట్లాడారు. ఆసుపత్రి కాన్పుల వార్డులో నాగేశ్వరి, నేత్రావతి అనే బాలింతల వద్దకు వెళ్లారు. వారికి జన్మించిన నవజాత శిశువులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తనపై ఇద్దరు బాలింతలు, వారి సహాయకుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు.
photo gallary











