పర్యాటక కేంద్రంగా మారనున్న కౌలాస్ ప్రాంతం

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది. పర్యాటకఅభిరుద్దికి భూమీ కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖ అధికారులు కౌలాస్ ఖిల్లా దిగువ ప్రాంతంలో జాయింట్ సర్వేను కొన్ని రోజులుగా విడతల వారీగా నిర్వహించి భూమి వివరాలు సేకరించారు.శుక్రవారం నాడు క్షేత్రస్థాయిలో సమావేశమైన రెవెన్యూశాఖ,పర్యాటకశాఖ అధికారులు టూరిజం శాఖ ఈఓ రాంమూర్తి,ఎఈఈ సోహైల్ కు 40ఎకరాల 10 గుంటల భూమిని టూరిజం శాఖకు కేటాయిస్తూ సదరు దస్తావేజులను జుక్కల్ తాసిల్దార్ పి.మారుతి డిప్యూటీ తాసిల్దార్ హేమలత వారికి అందజేశారు.భూమి కేటాయింపు పూర్తి కావడంతో కౌలాస్ ఖిల్లాతో పాటు కౌలాస్ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది. ఈ సందర్భంగా గిర్ధవర్ రామ్ పటేల్, సర్పంచ్ భర్త బల్ రాం,జిపిఓ సాయిలు,సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ నాగనాథ్ పటేల్,మంత్రి సాయిలు గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
