ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలి..

ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలి..
పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి
బిక్కనూర్ , ఆంధ్రప్రభ : ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్, బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కొత్తబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు సమాజంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు .గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు వాటిని ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక పేద కుటుంబం సంతోషంగా లేరని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మండలంలో సుమారు 800 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు . కార్యక్రమంలో సిద్ది రామేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ జనగామ రాణి, శ్రీనివాస్ బస్వాపూర్ గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
