Balakrishna | సంక్రాంతి రిలీజ్ ప్లాన్ మారిందా..?

Balakrishna | సంక్రాంతి రిలీజ్ ప్లాన్ మారిందా..?

Balakrishna | బాలయ్య స్పీడ్ కొనసాగుతోంది
మలినేని గోపీచంద్‌తో కొత్త సినిమా
హరీష్ శంకర్ కాంబో సెట్ అవుతుందా?
రేసులోకి మల్లిడి వశిష్ట్
దిల్ రాజు బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్?
2027 సంక్రాంతి టార్గెట్?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నట సింహం బాలకృష్ణ.. స్పీడు మామూలుగా లేదు. అఖండ సినిమా నుంచి అఖండ 2 వరకు వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పుడు మలినేని గోపీచంద్ తో బాలయ్య భారీ చిత్రం చేస్తున్నారు. నెక్ట్స్ మంత్.. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. ఆతర్వాత ఎవరితో సినిమా చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇటీవల పవర్ స్టార్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్లాన్ మారిందని.. రేసులోకి ఊహించిన డైరెక్టర్ వచ్చాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఎవరా డైరెక్టర్..? ఏంటా ప్లాన్..?

Balakrishna | మార్చిలో సెట్స్ పైకి బాలయ్య సినిమా..

Balakrishna

బాలకృష్ణ, మలినేని గోపీచంద్.. ఈ ఇద్దరి కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రూపొందడం.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో మరోసారి సినిమా చేయాలి అనుకున్నారు. ఇప్పటికి సెట్ అయ్యింది. ముందుగా హిస్టారికల్ మూవీ చేయాలి అనుకున్నా.. ఆతర్వాత బడ్జెట్ కారణంగా గ్యాంగ్ స్టర్ కథతో సినిమా చేస్తున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ముందుగా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ అంతగా ఉండదు కాబట్టి.. ఫాస్ట్ గా కంప్లీట్ చేసి దసరాకే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.

Balakrishna | బాలయ్య, హరీష్ శంకర్ మూవీ..

Balakrishna

అయితే.. బాలయ్యతో పవర్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా చేసేందుకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. కెవిఎన్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ క్రేజీ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీలో వినిపించింది. ఇప్పుడు ఊహించని డైరెక్టర్ పేరు తెర పైకి వచ్చింది. అతనే.. మల్లిడి వశిష్ట్. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి.. రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే విశ్వంభర.

Balakrishna | బాలయ్యతో మల్లిడి వశిష్ట్..

Balakrishna

ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీ వీఎఫ్‌ఎక్స్ కారణంగా లేట్ అవుతుంది. ఈ సినిమాని జులై 9న రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంత వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. వశిష్ట్ బాలయ్య కోసం కథ రెడీ చేసారని.. త్వరలోనే బాలయ్యకు కథ వినిపించనున్నారని తెలిసింది. ఈ కాంబో మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. బాలయ్యని వశిష్ట్ కథతో మెప్పిస్తే.. జూన్ 10న గ్రాండ్ గా లాంచ్ చేయాలి అనుకుంటున్నారట. ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందని టాక్. అయితే.. విశ్వంభర రిలీజ్ కాకుండా వశిష్ట్ బాలయ్యతో సినిమా స్టార్ట్ చేస్తారా…? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Leave a Reply