Jai Kisan | క్షేత్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారి…

Jai Kisan | క్షేత్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారి…

Jai Kisan | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులకు సాగులో భరోసా కల్పిస్తూ, ఆధునిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పై అవగాహన పెంచేందుకు, ఉరవకొండ లోని జై కిసాన్ అక్షయపాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రం, శిక్షణ కేంద్రాన్ని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు రవి మంగళవారం ప్రారంభించారు. జై కిసాన్ ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లి ఓబులేష్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన, క్షేత్రం రైతులకు దిక్సూచిగా నిలవ నుంది. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ నీటి వినియోగంతో గరిష్ట దిగుబడిని సాధించే అక్షయపాత్ర నమూనాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతాలకు ఎంతో అనువైనదని కొనియాడారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా జిల్లాలోని రైతులకు నిరంతరం సాగు మెళకువలు, సేంద్రియ ఎరువుల తయారీ, అంతర పంటల సాగుపై శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయడం ద్వారానే భూసారాన్ని రక్షించుకోగల మన్నారు. జై కిసాన్ ఫౌండేషన్ ఉరవకొండ ప్రాంతంలో ఇలాంటి వినూత్న ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు.

ఈ సందర్భంగా జై కిసాన్ ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లి ఓబులేష్ మాట్లాడుతూ ప్రతి రైతును ఒక వ్యాపారవేత్తగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ప్రదర్శన క్షేత్రం ద్వారా వందలాది మందికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ​రైతు రాజు కావాలన్నదే మా ఫౌండేషన్ ఆశయం. అక్షయపాత్ర నమూనా ద్వారా ప్రతి రైతు తనకున్న స్వల్ప భూమిలోనే వైవిధ్యమైన పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా మేము శిక్షణ ఇస్తాము తెలిపారు. ​ఈ కార్యక్రమంలో అనంతపురం టెక్నికల్ ఏవో బాలు, ఉరవకొండ వ్యవసాయ అధికారి రామకృష్ణుడు, జై కిసాన్ ఫౌండేషన్ ప్రతినిధులు లావణ్య, చరణ్, రజియా,
ఏ ఈ వో వెంకటనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply