సామాన్యుడికి మేయర్ పట్టం

సామాన్యుడికి మేయర్ పట్టం

నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి..
ఇందూరు గడ్డపై ఎగిరిన కాంగ్రెస్ జెండా..
ఎంఐఎం పొత్తుతో కాంగ్రెస్…


నిజామాబాద్, ఫిబ్రవరి16 (ఆంధ్రప్రభ) : ఇందూరు ప్రజల్లో ఎవరి నోట విన్నా ఇందూర్‌గడ్డపై ఏ జెండా ఎగిరేనా.. అన్న ఉత్కంఠకు తెరవీడింది. ఎట్టకేలకు ఇందూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం అనూహ్య మలుపులు తిరిగింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ చతురతతో కాంగ్రెస్ పావులు కదిపింది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ, ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణికి మేయర్ గా ఎన్నికయ్యారు.

సామాన్య నేపథ్యం..


49వ డివిజన్ కార్పొరేటర్ గా కూరగాయల ఉమారాణికి ఉన్న సామాన్య నేపథ్యం, ప్రజలతో ఆమెకున్న మమేకత్వం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. జిల్లా రాజకీయాలపై పట్టున్న మహేష్ కుమార్ గౌడ్, ఉమారాణి పేరును అధిష్టానం వద్ద బలంగా ప్రతిపాదించి ఎట్టకేలకు ఇందూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.

టిపిసిసి అధ్యక్షుడి ఆశీర్వాదం తీసుకున్న ఉమారాణి..


మేయర్ గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి మొట్టమొదటిసారిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

నిజామాబాద్ అభివృద్ధి మాధ్యేయం..
మేయర్ కూరగాయల ఉమారాణి..


నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే త‌న లక్ష్యమని మేయర్ ఉమారాణి అన్నారు. ప్రజల ఆశీర్వాదమే ఈ విజయమని ఆమె అన్నారు.

Leave a Reply